Posts

మహాసంపదలిచ్చు – మణిద్వీప వర్ణన

మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములొ మంత్రరూపిణి మన మనస్సులలొ కొలువైయింది||1|| సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు ||2|| లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు ||3|| పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాధుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు అమ్మ భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం ||4|| పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవునగలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు ||5|| అరువదినాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు ||6|| అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిదులు ||7|| కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిదులు || అమ్మ భువనేశ్వరీ|| ||8|| కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపాన...